![]() |
![]() |

గీతు రాయల్.. బిగ్ బాస్ సీజన్-6 చూసిన ప్రతీ ఒక్కరికి సుపరిచితమే. బిగ్ బాస్ హౌజ్ లోకి ఒక రివ్యూ రైటర్ గా అడుగుపెట్టిన గీతు రాయల్.. స్ట్రాటజీ, గేమ్ ప్లాన్ కి హోస్ట్ గా చేసిన నాగార్జున ఫిధా అయ్యాడంటే.. తను ఏ లెవెల్ లో ఆడిందో అందరికి తెలిసే ఉంటుంది. తనని తాను చిత్తూరు చిరుతగా పరిచయం చేసుకున్న గీతు.. బిగ్ బాస్ తో ఫుల్ ఫేమ్ లోకి వచ్చి సెలబ్రిటీ లిస్ట్ లోకి చేరింది.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు ఆదిరెడ్డితో మంచి రాపో ఏర్పరుచుకున్న గీతు.. ఎలిమినేట్ అయినప్పుడు చిన్నపిల్లలా హౌజ్ నుండి వెళ్ళనని మారం చేయడం, తను ఏడ్వడం చూసిన వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు. తనను విమర్శించేవాళ్ళకి సైతం ఆ టైంలో జాలేసిందనే చెప్పాలి. అంతలా బిగ్ బాస్ కి కనెక్ట్ అయిన గీతు.. బయటకొచ్చాక బిగ్ బాస్ లో తనతో ఉన్న అందరిని కలుస్తూ రీల్స్ చేస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా బిగ్ బాస్ ఫ్రెండ్స్ ని కలిసినట్లుగా వీడియోలు అప్లోడ్ చేస్తుంది. వీడియోల ద్వారా కొన్ని మోటివేషనల్ కోట్స్ కూడా తన అభిమానులకు చెప్తూ అందరిని ఇన్ స్పైర్ చేస్తోంది గీతు.
బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసిన కంటెస్టెంట్స్.. బయటకు వచ్చాక వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటున్నారు. కొందరయితే కేవలం యూట్యూబ్ కే పరిమితం అయ్యారు. అందులో గీతూ రాయల్, ఆదిరెడ్డి ఉన్నారు. గీతు, ఆదిరెడ్డిల మధ్య రాపో గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ లో వీళ్ళదే హవా. అయితే తాజాగా ఆదిరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో.. టీవీ ఇండస్ట్రీ అంటే ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా గీతూకి మాత్రం ఆఫర్స్ వెతుకుంటూ రావట్లేదు. దాంతో యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా బిగ్ బాస్ ఫ్రెండ్స్ ని కలవడం.. వారితో పబ్ లు, పార్టీలంటూ ఎంజాయ్ చేస్తుంది గీతు. అంతే కాకుండా తాజాగా ఇనయా సుల్తానా, రాజ్, గీతూ ముగ్గురు కలిసి ఒక పార్టీకి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసారు. అదే విషయాన్ని గీతు తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇలా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది గీతు.
![]() |
![]() |